
చిన్నారి ఒంటిపై 51 గాయాలు.. మరో వీడియో వైరల్
కేరళలోని నెడుమంగాడ్లో మారుతండ్రి నరరూప రాక్షసుడిలా మారి చేసిన దాడిలో చిన్నారి అర్షిద్ ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలుడి పోస్ట్మార్టం నివేదికలో ఒంటిపై ఏకంగా 51 గాయాలున్నాయని, 7 పక్కటెముకలు విరిగాయని వైద్యులు పేర్కొనడం అందరినీ కలచివేస్తోంది. గతంలోనే చేయి విరగడం, సిగరెట్ కాల్చిన గాయాలతో బాలుడిని ఆస్పత్రికి తెచ్చినా, అప్పుడే పోలీసులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని డాక్టర్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్నారి నవ్వుతూ ఆడుకుంటున్న పాత వీడియోలు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు.




