TG: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సుదీర్ఘంగా 5 గంటల చర్చ జరుగుతుండగా అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. తమకు మైక్ ఇవ్వడం లేదని BRS ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. రాష్ట్ర మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఘోష్ కమిషన్ నివేదికను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెత్తకుండిలో పడేశారు. తమను మహిళా మార్షల్స్ అదుపు చేస్తారా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గన్ పార్క్ ఎదుట నిరసన తెలుపుతున్నారు.