BREAKING: ఘోర ప్రమాదం.. 10 మంది స్పాట్‌డెడ్

5973చూసినవారు
మహారాష్ట్రలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. భందరా నుంచి గోండియా వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 30 మంది వరకు గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బస్సు ప్రమాద ఘటనపై బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్