బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.550 తగ్గి రూ.1,43,950కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.600 తగ్గి రూ.1,57,040 పలుకుతోంది. కేజీ వెండి ధరపై రూ.100 పెరగడంతో రూ.2,90,100 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.