వివాహం చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసిన వ్యక్తి తనపై అత్యాచారం, దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీబీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర అంగీకారంతో కూడిన సహజీవనానికి, లైంగిక నేరాలకు మధ్య ఉన్న తేడాలను ఆమె నొక్కి చెప్పారు. వయోజనులు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, అటువంటి సంబంధాలలో సహజంగానే కొన్ని రిస్క్‌లు ఉంటాయని, సహజీవనం నుంచి అకారణంగా బయటకు వెళ్లిపోవడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు సూచించింది.