బ్రెవిస్ అద్భుత క్యాచ్: జాంటీ రోడ్స్‌ను గుర్తుకు తెచ్చిన యువ సఫారీ

19761చూసినవారు
రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆడిన షాట్‌ను అమాంతం గాల్లోకి ఎగిరి, ఒంటిచేత్తో ఒడుపుగా పట్టుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన క్రికెట్ అభిమానులు, దీనిని ప్రపంచ క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ చేసిన క్యాచ్‌లతో పోలుస్తున్నారు. బ్రెవిస్ ఈ క్యాచ్‌తో రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీయడంలో కీలక పాత్ర పోషించాడు, దీంతో టీమిండియా 183 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

సంబంధిత పోస్ట్