తన పెళ్లికి వచ్చిన అతిథి ఒక్కసారిగా కుప్పకూలడంతో పెళ్లి కూతురే రంగంలోకి దిగి ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా బండివాడలో జరిగింది. ఓ వివాహానికి హాజరైన మహిళ అకస్మాత్తుగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. అయితే పెళ్లి కూతురు డాక్టర్ కావడంతో వెంటనే మండపంలోంచి వచ్చి ఆమెను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవడంతో వధువుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.