మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా బండివాడేలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. వేడుకకు హాజరైన ఓ మహిళ అకస్మాత్తుగా వేదికపైనే కుప్పకూలిపోయింది. అయితే, అక్కడే ఉన్న వధువు, ఆమె డాక్టర్ కావడంతో వెంటనే స్పందించి, వేదికపైనే సదరు మహిళకు చికిత్స అందించి ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.