చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మేర్కాంగ్ సిటీలో ఉన్న హాంగ్కీ వంతెనలో కొంత భాగం కూలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అధికారులు ఒక రోజు ముందే వంతెనపై పగుళ్లను గుర్తించి, దానిపై రాకపోకలను నిలిపివేశారు. ఈ ముందు జాగ్రత్త చర్యల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వంతెన కూలడంతో పాటు కొండచరియలు విరిగిపడి, ఆ ప్రాంతమంతా దుమ్ముమయమైంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.