
గోదావరిలో చిక్కుకున్న యువకులు.. కాపాడిన జాలర్లు (వీడియో)
TG: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీ సాగర్ సమీపంలో గోదావరి కుర్రులో చేపలు పట్టడానికి వెళ్లిన రాజ్ కుమార్, రాజేష్ అనే ఇద్దరు యువకులు సోమవారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతికి ప్రవాహంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, స్థానిక జాలర్ల సహాయంతో తెప్పల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.




