భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ బంపరాఫర్‌.. రెండేళ్ల గ్రాడ్యుయేట్‌ వీసా

7చూసినవారు
భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ బంపరాఫర్‌.. రెండేళ్ల గ్రాడ్యుయేట్‌ వీసా
బ్రిటన్‌లో ఉన్నత విద్య పూర్తి చేసే భారతీయ విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. నిబంధనలు పక్కాగా పాటిస్తూ, విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో చదివిన అంతర్జాతీయ విద్యార్థులకు రెండేళ్ల గ్రాడ్యుయేట్‌ వీసా ఇవ్వనున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి సాధారణ బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ విద్యార్థుల వీసా గడువు 18 నెలలకు తగ్గనుంది. యూనివర్సిటీ అర్హతను బట్టి చదువు తర్వాత బ్రిటన్‌లో ఉండే గడువు మారనుంది. అయితే అర్హత ప్రమాణాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్