TG: మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సందర్శించారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ చేనేత వస్త్రాలు ధరించిన ఆయన, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని తుల భారం వేశారు. ఆయన వెంట మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మేడారం మహా జాతర విశిష్టతను, భక్తుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను గారెత్‌కు వివరించారు.