బ్రిటిష్‌ ఇండియన్‌ నటి మీరాకు డేమ్‌హుడ్‌ అవార్డు

62చూసినవారు
బ్రిటిష్‌ ఇండియన్‌ నటి మీరాకు డేమ్‌హుడ్‌ అవార్డు
ప్రముఖ బ్రిటిష్‌ ఇండియన్‌ నటి మీరా సియాల్‌ (64) కు ప్రతిష్ఠాత్మక డేమ్‌హుడ్‌ అవార్డు లభించింది. కొత్త సంవత్సరాది సందర్భంగా బ్రిటన్‌లో కింగ్‌ చార్లెస్‌-3 ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఆమె అందించిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. లండన్‌లో డిసెంబరు 30న అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేశారు. మీరా సియాల్‌ ‘గుడ్‌నెస్‌ గ్రేషియస్‌ మి’, ‘ది కుమార్స్‌ ఎట్‌ నం.42’ వంటి కామెడీ సిరీస్‌ల ద్వారా గుర్తింపు పొందారు.

సంబంధిత పోస్ట్