
విజయవాడలో భార్యని దారుణంగా హత్య చేసిన భర్త (వీడియో)
AP: విజయవాడ నగరంలో నడిరోడ్డుపై భార్య సరస్వతిని భర్త విజయ్ కిరాతకంగా హత్య చేశాడు. మెడపై పొడిచి, పీక కోయడంతో తీవ్ర రక్తస్రావంతో మహిళ కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. 2022 ఫిబ్రవరి 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. నిందితుడు విజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




