పాముకాటుకు గురైన తమ్ముడిని కాపాడేందుకు.. 150 సార్లు చెంపదెబ్బలు! (వీడియో)

0చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో విషపాము కాటుకు గురైన 21 ఏళ్ల అరుణ్‌ను కాపాడేందుకు అతని అన్న ఆకాశ్ చేసిన ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. పొలంలో పాము కాటేయడంతో అరుణ్ పరిస్థితి విషమించగా, ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అతడిని నిద్రపోనివ్వకుండా ఆకాశ్ ముఖంపై నీళ్లు చల్లుతూ, 150 సార్లకు పైగా చెంపదెబ్బలు కొట్టాడు. శరీరం అంతా విషం తీవ్రంగా వ్యాపించడంతో వైద్యులు రెండు గంటల్లో 15 డోసుల యాంటీ-వెనమ్ ఇచ్చారు. ప్రస్తుతం అరుణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్