తన చెల్లికి సైకిల్ కొనివ్వాలనే కోరికతో, ఓ బాలుడు తన తల్లిదండ్రులు, తాతయ్యలు ఇచ్చిన పాకెట్ మనీని ఎంతో పొదుపుగా దాచుకున్నాడు. అలా కూడబెట్టిన చిల్లర డబ్బులతో షాపుకెళ్లి, తన చెల్లి కోసం సైకిల్ కొని బహుమతిగా ఇచ్చాడు. అన్న, చెల్లెల అనుబంధాన్ని చాటిచెప్పే ఈ హృద్యమైన సంఘటన ఎక్కడ జరిగిందో తెలియని కానీ, గాని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంటోంది.