బీఆర్‌ఎస్‌ 25 ఏళ్లు: కేసీఆర్‌ వల్లే తెలంగాణ సాధ్యం - హరీశ్‌రావు

2263చూసినవారు
బీఆర్‌ఎస్‌ 25 ఏళ్లు: కేసీఆర్‌ వల్లే తెలంగాణ సాధ్యం - హరీశ్‌రావు
TG: రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుందని, బీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతోనే తెలంగాణ కల సాకారమైందని పేర్కొన్నారు. కేసీఆర్‌ లేకపోతే బీఆర్‌ఎస్‌ లేదని, బీఆర్‌ఎస్‌ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. నాలుగు కోట్ల మంది ప్రజలను ఏకతాటి మీదకు తెచ్చిన మహానాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు. బీడువారిన భూములను సస్యశ్యామలంగా మార్చిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుదే అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్