తెలంగాణ భవన్ వద్ద అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. సుమారు 3 వేల మంది వస్తారని అంచనా వేస్తే.. 5-6 వేల మంది పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడంతో పోలీసులు వారిని అదుపు చేయడంలో కంగారు పడ్డారు. మరోవైపు, పార్టీ కార్యకర్తలందరి కోసం భవన్‌లో భోజన ఏర్పాట్లు చేశారు.