
అయోధ్య రామ మందిర కొత్త ట్రస్టీగా కృష్ణమోహన్
అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ను నియమించారు. చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించిన ట్రస్టు, ఆయన స్థానంలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని ట్రస్టు కోశాధికారి గోవింద్ గిరి మీడియాకు వెల్లడించారు. సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.




