
భారత్‌లో ఓపెన్ఏఐ నియామకాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. యూజర్ బేస్ పరంగా అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్‌లో తన సేవలను విస్తరించాలని చూస్తోంది. ముఖ్యంగా ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్‌పై కన్నేసింది. ఇందులో భాగంగా భారత్‌లో ఇంజనీర్ల నియమకాలు ప్రారంభించింది. కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.




