TG: 'జూబ్లీహిల్స్'లో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ పిచ్చి నాటకాలు ఆడుతోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతూ.. ఆ పార్టీ నేతలు మతపరమైన ప్రదేశాలకు వెళ్లి ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వీరు ఎవరి సలహా మేరకు ఇలా ప్రచారం చేస్తున్నారని, వీరి వెనుక ఉన్నది కేటీఆరా లేక హరీశ్ రావా అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని దయాకర్ డిమాండ్ చేశారు.