గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై BRS కసరత్తు

64చూసినవారు
TG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌ మీద ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మరో రెండు రోజుల్లో మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్