గ్రాడ్యుమేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ కసరత్తు

11చూసినవారు
గ్రాడ్యుమేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ కసరత్తు
TG: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ స్థానంపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేయించాలని ఆయన పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ఈ ఎన్నికల్లో మళ్లీ హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానం బీఆర్‌ఎస్‌దేనని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్