బీఆర్ఎస్ రూ.10 లక్షల కోట్ల అప్పు చేసింది: కిషన్ రెడ్డి

12చూసినవారు
TG: 2014లో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘పదేళ్లు పాలించిన  బీఆర్ఎస్ రూ.10 లక్షల కోట్లు అప్పు చేసింది. గత రెండేళ్లుగా కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోంది. భూములు అమ్మితేనే ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతాల్లోని వేల ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లకు అనుమతిస్తే ట్రాఫిక్ పరిస్థితి ఏంటి’ అని నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్