TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీశ్ రావు అబద్దాలు చెప్తున్నారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మాట్లాడుతూ.. 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని బీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు వాళ్లు ఖర్చు చేసింది కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమేనని, కానీ, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ.80 వేల కోట్లు కావాలన్నారు.