బీఆర్ఎస్ నేత రాకేష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద విద్యార్థి సంఘాలు గ్రూప్-1పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రాకేష్‌రెడ్డి వెళ్లారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సమావేశం నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా లేదా అంటూ పోలీసులపై రాకేష్‌రెడ్డి మండిపడ్డారు. గ్రూప్-1పై అభ్యర్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.