తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియా చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'చాలా మంది బీఆర్ఎస్ నేతలు నాతో టచ్ లో ఉన్నారు. జనం బాట కార్యక్రమంలో పాత బీఆర్ఎస్ క్యాడర్ నాతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు, ఉద్యమకారులు అసంతృప్తిలో ఉన్నారు' అని అన్నారు. కాగా జాగృతి జనం బాట యాత్రలో కవిత శనివారం రెండో రోజు కరీనంగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.