బీఆర్‌ఎస్‌ నేతలు సింగరేణి వనరులు దోచుకున్నారు: భట్టి విక్రమార్క

16చూసినవారు
బీఆర్‌ఎస్‌ నేతలు సింగరేణి వనరులు దోచుకున్నారు: భట్టి విక్రమార్క
TG: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగిన సింగరేణి డిపెండెంట్ కార్మికుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా 335 మంది సింగరేణి కార్మికుల వారసులకు ఆయన కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలు సింగరేణి వనరులు దోచుకున్నారని విమర్శించారు. హరీష్‌రావు అబద్ధాలరావుగా మారిపోయారన్నారు. సింగరేణిని ప్రజా ప్రభుత్వమే కాపాడుతుందని.. సింగరేణి కార్మిక కుటుంబాల్లో వెలుగు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్