TG: ములుగులో మంత్రి సీతక్క బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మేడిగడ్డపై బీఆర్‌ఎస్ నేతలు డ్రామాలు మానుకోవాలని, నేషనల్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కాళేశ్వరం నీళ్లపై కక్ష సాధింపు కాదని స్పష్టం చేశారు. ఏ చిన్న డ్యామేజ్ జరిగినా గ్రామాలే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, గత ప్రభుత్వ తప్పిదాలకు తమ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.