కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ప్రాంతంలో కృష్ణా నదీ తీరాన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, ఇతర బీఆర్ఎస్ నాయకులు వరంగల్ డిక్లరేషన్‌కు పిండం పెట్టారు. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు.