
AIకి సొంత తెలివి తెప్పించేందుకు ప్రయత్నించొద్దు: మైక్రోసాఫ్ట్ AI చీఫ్
AI రంగంలో మానవ స్పృహను తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలను మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ తప్పుబట్టారు. ఏఐకి సొంతంగా ఆలోచించే సామర్థ్యం రావడం అసాధ్యమని, మనిషికి మాత్రమే నిజమైన భావోద్వేగాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సీఎన్బీసీ ఆఫ్రోటెక్ సదస్సులో మాట్లాడుతూ, ఏఐని మానవులకు సహాయకారిగా మాత్రమే అభివృద్ధి చేయాలని, స్పృహను తీసుకురావడానికి ప్రయత్నించడం అనవసరమని సులేమాన్ సూచించారు. ఈ తరహా పరిశోధనలపై సమయం వెచ్చించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.




