
దగ్గుమందు మరణాలు.. శ్రేసన్ ఫార్మా కంపెనీ మూసివేత
మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారుల మరణాలకు కారణమైన 'కోల్డ్రిఫ్' దగ్గు మందు తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మా అనుమతులు రద్దు చేసి, యూనిట్ మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిరప్‌లో విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. సరైన తయారీ పద్ధతులు అవలంబించడం లేదని, 300కు పైగా ఉల్లంఘనలను రికార్డు చేసినట్లు గుర్తించిన అధికారులు, సంస్థ యజమాని జి. రంగనాథన్‌ను అరెస్టు చేశారు.




