TG : కరీంనగర్‌లోని కేంద్రమంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద BRS, BJP, ABVP కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. BRS ఎమ్మెల్యే గంగుల క్యాంపు ఆఫీస్‌పై దాడిని నిరసిస్తూ BRS నేతలు బండి సంజయ్ ఆఫీస్‌కు చేరుకోగా, అక్కడే ఉన్న
బీజేపీ, ఏబీవీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగినా ఘర్షణ కొనసాగుతోందని, తమపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని BRS నేతలు ఆరోపించారు.