రాష్ట్రంలో ఫామ్‌హౌస్ కల్చర్‌ను తెచ్చింది బీఆర్ఎస్సే: MP చామల

4087చూసినవారు
TG: తొమ్మిది జిల్లాల్లో, 24 మండలాలు, 33 గ్రామ పంచాయతీల్లో 400 ఎకరాలకు పైగా భూములు కేసీఆర్ కుటుంబం ఆధీనంలో ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నిజాం నవాబు 200 ఏళ్లలో కూడబెట్టిన ఆస్తులను కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో సంపాదించిందన్నారు. జగదీష్ రెడ్డికి శంషాబాద్‌లో ఫామ్‌హౌస్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫామ్‌హౌస్ కల్చర్‌ను బీఆర్ఎస్‌ తెచ్చిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్