దారుణం.. 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

2279చూసినవారు
దారుణం.. 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
TG: 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి వృద్ధురాలు తన ఇంటిలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దుండగులు ఆమెపై తీవ్రంగా దాడి చేసి అత్యాచారానికి ఒడిగట్టి, అక్కడ నుంచి పరారయ్యారు. గురువారం విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్