TG: హైదరాబాద్ ఘౌస్‌నగర్‌లో బుధవారం అర్ధరాత్రి HKGN పాన్‌షాప్ యజమాని మొహ్సిన్ (35) ను గుర్తు తెలియని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత విభేదాలు, వ్యాపార వివాదం లేదా పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.