TG: హైదరాబాద్‌లోని టోలిచౌకీలో ఓ జ్యూస్ సెంటర్ దగ్గర జరిగిన చిన్న వివాదం హత్యకు దారితీసింది. ఈ నెల 8న బీహార్‌కు చెందిన మోఫిల్ (22) అనే యువకుడు, తోటి కార్మికుడు గులారెజ్ ఆలంపై స్టీల్ గరిటెతో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మెహిదీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు మోఫిల్‌ను అరెస్ట్ చేశారు.