తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో శ్రవణ్ సాయి (20) అనే యువకుడిని అతని ప్రియురాలి తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. తమ కూతురితో ప్రేమలో ఉన్నాడని, పెళ్లి చేస్తామని నమ్మించి ఇంటికి పిలిపించి, క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.