TG: హైదరాబాద్ అలీనగర్‌కు చెందిన రౌడీషీటర్ సోహైల్(25)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. సుభాన్ కాలనీ ఫేజ్-2లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్యతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనాస్థలిని పరిశీలించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తూ సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.