గొంతు నులిమి ఎస్సై అత్త దారుణ హత్య.. బంగారం చోరీ

108చూసినవారు
గొంతు నులిమి ఎస్సై అత్త దారుణ హత్య.. బంగారం చోరీ
AP: నెల్లూరు జిల్లా కావలిలో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. మృతురాలు కావలి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న తిరుమలరెడ్డి అత్త పొంగులూరి విజయలక్ష్మి (68) అలియాస్‌ వీరమ్మ. తుపాన్‌ నగర్‌ బైరాగులవీధిలో ఒంటరిగా నివసిస్తున్న ఆమె ఇంట్లోకి గురువారం చొరబడిన దుండగులు.. వీరమ్మ గొంతు నులిమి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం మెడలోని నగలు, గాజులు, చెవిదిద్దులతోపాటు బీరువాలో ఉన్న సుమారు 30 సవర్ల బంగారు నగలను దోచుకెళ్లారు. కావలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్