
మూడు ఫార్మాట్లలో శతకం.. జైశ్వాల్ అరుదైన రికార్డ్
భారత యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే, టీ20, టెస్ట్ ఫార్మాట్లలో సెంచరీ చేసిన 7వ భారతీయ క్రికెటర్గా నిలిచాడు. శనివారం విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో జైశ్వాల్( 111 బంతుల్లో 100 రన్స్) సెంచరీ కొట్టడం ద్వారా ఈ రికార్డ్ నెలకొల్పాడు. 23 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించడం మరో విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల సరసన చేరాడు.




