
పిఠాపురంలో జనసేన పార్టీ కమిటీల నియామకం ప్రారంభం
AP: నేటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కమిటీల నియామక ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సూచనల మేరకు మూడు రోజుల పాటు ఈ కమిటీల నియామకం జరగనుంది. వార్డు, బూత్, గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటు చేసే కసరత్తు ప్రారంభమైంది. ప్రతి వార్డులో 10 నుంచి 15 మంది సభ్యులతో వార్డు ఇంఛార్జీలను ఎంపిక చేయనున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న జనసైనికులు, వీరమహిళలకు గుర్తింపు కల్పించేలా ఈ కమిటీల నియామకం జరుగుతోంది.




