2026 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి, రైతులు, వృద్ధులకు అనుకూలమైన ప్రకటనలు చేయవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రామాణిక మినహాయింపును రూ.1 లక్షకు పెంచితే, రూ.13 లక్షల వరకు వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోవచ్చు. పాత పన్ను విధానాన్ని వదిలి, కొత్త విధానాన్ని ఆకర్షణీయంగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు వార్షిక సహాయం రూ.6,000 నుండి రూ.9,000కు పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.