రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కర్ణాటక మంగళూరులోని వెన్‌లాక్ జిల్లా ఆస్పత్రిలో ‘బగ్గీ అంబులెన్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సర్జరీ జరిగిన రోగులతో సహా ఇతర పేషెంట్లకు ఆసుపత్రిలోని ఇతర వార్డులకు సులువుగా తరలించే వీలుగా ఈ సదుపాయాన్ని కల్పించారు. రూ.7 లక్షల నిధులతో బగ్గీ అంబులెన్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీటిని మరిన్ని ఆస్పత్రిల్లో సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు.