ఢిల్లీలోని కరావల్ నగర్‌లో బుధవారం నాలుగు అంతస్తుల నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనానికి పగుళ్లు రావడంతో అందులోని నివాసితులు ముందుగానే ఖాళీ చేశారు. ఆ భవనం సమీపంలో డ్రైనేజీ పనులు చేపట్టడంతో పగుళ్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భవనం కూలడంతో ప్రజలు పరుగులు తీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.