
సల్మాన్‌ఖాన్ ఇంటి ముందు కానిస్టేబుల్ మృతి
ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గణేశ్ (41) అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. డ్యూటీలో ఉండగా అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా, గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. గతంలో సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.




