వృద్ధుడిని కొమ్ములతో ఎత్తి పడేసిన ఎద్దు.. వీడియో

19266చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ జిల్లాలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 60 ఏళ్ల లాల్జీ పట్కర్‌ తన ఇంటి వద్ద రోడ్డుపై నిల్చుని ఉండగా, ఒక నల్ల ఎద్దు ఒక్కసారిగా ఆయనపై దాడి చేసింది. వెనుక నుంచి కొమ్ములతో ఎత్తి పడేయడంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. కిందపడి లేవలేకపోయిన ఆయనను స్థానికులు పైకి లేపి ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్