ఉత్తర్ ప్రదేశ్‌లో 'ఐ లవ్ ముహమ్మద్' వివాదంతో చెలరేగిన అల్లర్లపై సీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ చర్యలకు ఆదేశించారు. ఈ అల్లర్లకు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న IMC అధ్యక్షుడు తౌకీర్ రజా ఖాన్, ఆయన అనుచరుల ఆస్తులపై అధికారులు చర్యలు ప్రారంభించారు. బరేలీలో నదీమ్ ఖాన్, ఫర్హాన్, మొహమ్మద్ ఆరిఫ్‌ల అక్రమ నిర్మాణాలను సీల్ చేసి కూల్చివేశారు. అతీక్ అహ్మద్ బావమరిది సద్దా ఆస్తిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలను విస్తృతంగా మోహరించారు.