అరుదైన రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో జస్‌ప్రీత్ బుమ్రా

30చూసినవారు
అరుదైన రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో జస్‌ప్రీత్ బుమ్రా
T20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో గురువారం జరిగే మ్యాచ్‌లో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ తీస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరతారు. ఈ ఘనత సాధించిన 8వ భారత బౌలర్‌గా ఆయన నిలుస్తారు. ఇప్పటివరకు టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20ల్లో 116 వికెట్లు తీశారు. భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే (956) అత్యధిక వికెట్లు తీయగా, ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (717), కపిల్ దేవ్ (687), రవీంద్ర జడేజా (634), జహీర్ ఖాన్ (610), జవగళ్ శ్రీనాథ్ (551) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్