
విమానంలో పేలిన పవర్ బ్యాంకు.. తప్పిన ప్రమాదం (వీడియో)
హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్ పేలింది. దీంతో విమానంలోని క్యాబిన్ నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే పొగలను గమనించి, ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించారు. ఈ సంఘటనతో పెను ప్రమాదం తప్పింది.




